FbTelugu

కులం పేరుతో దాడి అమానుషం: లోకేశ్

అమరావతి: కులం పేరుతో దళిత ఆచార్యుడిపై దాడి చేయడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. దళిత ప్రొఫెసర్ ప్రేమానందంపై ఆంధ్రా యూనివర్సిటీలో కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

‘‘ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణం.దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందం గారి పై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఏయూ లో ప్రేమానందం గారిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల‌కు దిక్కుగా నిలిచిన డాక్ట‌ర్ బీఆర్ బేద్క‌ర్ గారి రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి జగన్ త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారు. వైకాపా నేతల దౌర్జ‌న్యాలు, అణిచివేత‌ల‌తో ద‌ళితులు ద‌గా ప‌డ్డారు’’ అంటూ పలు ట్వీట్లు చేశారు.

You might also like