FbTelugu

కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: నిన్న రాత్రి నగరంలోని బోయిన్‌పల్లిలో కేసీఆర్ సమీప బంధువులు కిడ్నాప్ గురైన కేసుపై విచారణ కొనసాగుతోందని హైదరాబాద్ సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీస్) అంజనీ కుమార్ స్పష్టం చేశారు. కిడ్నాప్ కి గురైన ముగ్గరు వ్యక్తులను సేఫ్ గా తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఈ కేసులో అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయినపల్లి పోలీసులు విచారణ ముమ్మరం చేసినట్టు తెలిపారు. తమకు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపై అయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.