FbTelugu

ఒకే డోసు… 28 రోజుల్లో యాంటిబాడీస్

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఒక డోసు కరోనా వ్యాక్సిన్ ఒకటి మాత్రమే యుఎస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో కంపెనీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రెండు డోసుల్లో పలు దేశాల్లో ఇస్తున్నారు. ఇదే కంపెనీ స్పుత్నిక్ లైట్ ను తయారు చేసి ఆవిష్కరించింది. ఒక డోసు వేసుకుంటే చాలని అంటోంది. స్పుత్నిక్ లైట్ ను వేసుకున్న తరువాత 28 రోజుల నాటికి వైరస్ ను ఎదిరించే యాంటీబాడీలు తయారు అవుతాయని అంటున్నారు. నూతనంగా వస్తున్న వైరస్ లను కూడా ఈ లైట్ వ్యాక్సిన్ అదుపు చేస్తుందని, ప్రభావశీలత 79.4 శాతం ఉన్నట్లు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ప్రకటించింది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫూర్తి కావడంతో రష్యా ప్రభుత్వం అత్యవసరం కింద వినియోగించేందుకు పచ్చజెండా ఊపింది.

మూడో దశ ట్రయల్స్ రష్యాతో పాటు ఘనా, యుఏఈ దేశాల్లో 7వేల మంది వాలంటీర్లపై నిర్వహిసుతన్నారు. ఈ నెలాఖరు కల్లా ప్రయోగాల రిపోర్టు వెల్లడించే అవకాశం ఉంది. ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరం రావడంతో సింగిల్ డోస్ రూపొందించామని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ప్రకటించింది. అదే విధంగా తక్కువ సమయంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తయారు చేయగా రెండో స్పుత్నిక్ లైట్.

You might also like

Leave A Reply

Your email address will not be published.