FbTelugu

ఒంగోలులో భూప్రకంపనలు

ప్రకాశం: ఇవాళ ఒంగోలులోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రెండు సెకన్లపాటూ సంభవించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గద్దలగుంట, మామిడిపాలెం, దేవుడి చెరువు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదైనాయి.

దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

You might also like