FbTelugu

ఐదుగురి ప్రాణాలు బలిగొన్న టిక్ టాక్ పిచ్చి 

వారనాసి: టిక్ టాక్ పిచ్చి ఓ ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు బాలురు టిక్ టాక్ వీడియో కోసం గంగానదిలో దిగారు.

వీడియో తీసుకుంటూ ఉండగా వారిలో ఓ బాలుడు ప్రమాదవ శాత్తు నదిలో మునిగిపోతుండగా అతన్ని కాపాడే క్రమంలో మిగతా నలుగురూ ఒక్కొక్కరుగా మునిగిపోయారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారంతా టీనేజ్ పిల్లలేనని తెలిపారు. మృతులు సైఫ్, రిజ్వాన్, సకీ, తౌసిఫ్, ఫదీన్ గా గుర్తించారు.

You might also like