FbTelugu

ఏపీలో రెస్టారెంట్లు, మాల్స్ రీ ఓపెన్

సీఎం జగన్ రెడ్డి కీలక ఆదేశాలు

అమరావతి: రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమంగా తిరిగి కార్యకలాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలని సీఎం వైఎస్.జగన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కోవిడ్‌ –19 నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకోసం ఎస్‌ఓపీలు రూపొందించాలని సూచించారు.

కరోనా పై అవగాహన పెంచేందుకు కరపత్రం సిద్ధం చేయాలన్నారు. కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందవద్దని, అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను కరపత్రంలో పొందుపరచాలని కోరారు. ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలని ఆదేశించారు.

ప్రజల్లో భయం, ఆందోళన తగ్గించేలా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏపీ నుంచి వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని, వారి కోసం బస్సులు నడిపేందుకు సిద్ధం చేయాలన్నారు. కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు.  కొత్తగా నమోదైన 48 కేసులలో 31 కేసులు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.