FbTelugu

ఏలూరు జైలులో కరోనా కలకలం

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరు జిల్లా జైలులో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. జైలులోని దాదాపు 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు. జైలులో మొత్తం 77 మందికి అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. వీరిలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. తోటి రిమాండ్ ఖైదీలకు కరోనా సోకడంతో మిగిలిన ఖైదీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

You might also like