అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చించనున్నారు. అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. కొత్త పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక ముసాయిదాలకు ఆమోదం తెలపనుంది.