FbTelugu

ఏపీలో మరో 199 కేసులు.. ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 199 మంది కరోనా బారిన పడ్డారు. కాగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,718 కి చేరుకుంది.

మొత్తం కరోనా మృతుల సంఖ్య 75 కు చేరింది. కాగా ఇవాళ కరోనా బారిన పడిన వారిలో 130మంది ఏపీవారుకాగా మరో 69 మంది ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారుగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,353 మంది కరోనానుంచి కోలుకోగా.. 1290 యాక్టివ్ కేసులున్నాయి.

You might also like