FbTelugu

ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని తెలిపారు.

బదిలీల కోసం ఎవరి చుట్టూ టీచర్లు చక్కర్లు కొట్టొద్దని ఈ సందర్భంగా మంత్రి సురేష్ సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేలోపు బదిలీలు పూర్తవుతాయని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్ల నియామకం చేయాలని సీఎం జగన్ సూచించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.