FbTelugu

ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాలి: కన్నా

అమరావతి: అవినీతికి ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది పాలనలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగింది వాస్తవమేనన్నారు.

You might also like