FbTelugu

ఎంపీ విజయసాయికి ధీటైన కౌంటర్

అమరావతి: వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ధీటైన కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణ ప్రజల రుణం తీసుకున్నట్లు అవుతుందని చంద్రబాబుకు వినతులు వస్తున్నాయని విజయసాయి ట్వీట్ చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు చూపాలని, దీని వల్ల పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని వ్యంగంగా అన్నారు.

దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న లోటస్ పాండ్ భవనం, బెంగళూర్ లో ఉన్న రాజప్రసాదం లాంటి యలహంక భవనాన్ని కరోనా హాస్పిటల్ కు ఇవ్వాలని సూచించారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న భవనాలు కావడంతో మంచి వైద్యం అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఈ భవనాలు ఇస్తే ప్రజధానం కొట్టేసి నరకానికి వెళ్లిన వైసీపీ ఆత్మకు కొంత ఊరట లభిస్తుందని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

You might also like