FbTelugu

ఎంఎస్ఎంఈ లకు రూ.3 లక్షల కోట్ల రుణాలు: నిర్మల

ఢిల్లీ: దేశంలో చిన్న, మధ్య, సూక్ష్మ (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమల కు రూ.3 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మల సీతారామన్ తెలిపారు.

ఈ రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా (కౌంటర్ గ్యారెంటీ) ఉంటుందని, యజమానులకు పూచికత్తు లేని రుణాలిస్తామని ఆమె అన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ అనే సూత్రాలతో ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీ రూపొందించామని తెలిపారు.

స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీని రూపకల్పన చేశామని ఆమె చెప్పారు. ఇక నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మల ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించారు. అన్ని మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తరువాతే ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఈరోజు నుంచి ప్యాకేజీ వివరాలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తామన్నారు.

మొత్తం ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రయోజనం ఉంటుందన్నారు. నాలుగు సంవత్సరాల్లో ఈ రుణాలు చెల్లించవచ్చని, ఒక ఏడాది మారటోరియం ఇస్తున్నామన్నారు. ఈ కంపెనీల సామర్థ్యం పెంచేందుకు రూ.10వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా రూ.50వేల కోట్లతో ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల కోసం రూ.20వేల కోట్లు నిధులు కేటాయించామన్నారు.

ఇక నుంచి రూ.200 కోట్ల విలువ చేసే పనులకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదన్నారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల జూన్, జూలై, ఆగస్టు పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందనన్నారు. ఈ మొత్తం రూ.2500 కోట్ల వరకు ఉంటుందన్నారు. పీఎఫ్ లో యాజమాన్య వాటా 12 శాతం నుంచి 10 శాతం తగ్గించామన్నారు. తక్షణమే కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాలని నిర్మల కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.