FbTelugu

ఆర్థిక వ్యవస్థపై జగన్ కు కనీస అవగాహన లేదు: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కనీస అవగాహన లేదని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

జగన్ మాటలను నమ్మి ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చారని అన్నారు. కానీ జగన్ మాత్రం మాఫియాలను ప్రోత్సహిస్తూ.. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రకృతి వనరులను పూర్తిగా దోచుకుంటున్నారని అన్నారు.

You might also like