FbTelugu

‘ఆరోజే మాట ఇచ్చాను’ : విజయ్ దేవరకొండ

Ive-just-said-a-word-says--Vijay-Deverakonda

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతి కొద్ది కాలంలోనే హీరోగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందిన విజయ్ ఇప్పుడు నిర్మాతగా మారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో ‘మీకు మాత్రమే చెప్తాను’ మూవీని విజయ్ రూపొంచాడు. తరుణ్ భాస్కర్, అనసూయ, వాణి భోజన్, అభినవ్ గోమఠం ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘పెళ్లి చూపులు’ మూవీ సమయంలోనే షమ్మీర్ సుల్తాన్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి మాట ఇచ్చాను. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు.

You might also like