FbTelugu

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఒయు కుదుర్చుకున్నది.

ఆయుష్మాన్ భారత్ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించనున్నారు. ఈమేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎ.రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఈఓ కు అమలుకు సంబంధించి సర్క్యూలర్ ను జారీ చేశారు. 2018 సెప్టెంబర్ లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యుడికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డు కలిగినవారు ఆసుపత్రిలో చేరితో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడంతో పాటు దేశ వ్యాప్తంగా 20వేల ఆసుపత్రులలో చికిత్స లభిస్తుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.