హైదరాబాద్: కేరళలో ఏనుగుని చంపినవారి ఆచూకి తెలిపితే రూ.2 లక్షల నజరానా అందచేస్తానని నేరేడ్ మెట్ వ్యక్తి శ్రీనివాస్ ప్రకటించారు.
కేరళ లో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. మనిషి ఇంత అరాచకానికి దిజగారుతాడా అనే ఆలోచన అందరిలో కలిగించిన విషయం తెలిసిందే. తల్లి ఏనుగుతో పాటు గర్భంలో ఉన్న పిల్ల ఏనుగు చనిపోవడం అందరినీ కలచి వేసింది. ఈ ఘటనపై నేరేడ్ మెట్ దేవీ నగర్ కు చెందిన శ్రీనివాస్ ఆచూకి చెప్పిన వారికి రూ.2 లక్షల నగదు అందచేస్తానని తెలిపారు.