FbTelugu

అతడు నిజంగానే మంచి దొంగ!

చెన్నై్: నేటి పరిస్థితుల్లో ఏ వస్తువైనా పోయిందంటే లేదా దొంగిలించబడిందంటే దాదాపు ఆ వస్తువును పొందలేమని వాటిపై ఆశలు వదిలేసుకుంటారు ప్రజలు. కానీ తమిళనాడులో ఓ వ్యక్తి దొంగతనం చేసి తిరిగి రెండు నెలల తర్వాత తిరిగి యజమానికి ఇచ్చేసి మంచి దొంగగా పేరు తెచ్చుకున్నాడు.

వివరాల్లోకెళితే.. తమిళనాడులోని సూలూరులో రెండు నెలల క్రితం ఓ బైక్ ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. అయితే తాజాగా.. ఆ బైకును దొంగిలించిన ప్రశాంత్ అనే వ్యక్తి బైక్ ను యజమానికి తిరిగి పంపాడు. తాను లాక్ డౌన్ లో ఇంటికి వెళ్లడానికే బైక్ దొంగిలించానని. తనను క్షమించమంటూ లేఖ రాశాడు. అతని నిజాయితీ నచ్చిన యజమాని అతనిపై ఎటువంటి కేసులు పెట్టబోనని బైక్ యజమాని స్పష్టం చేశాడు.

You might also like