FbTelugu

అంతిమ తీర్పు.. అంతా అప్రమత్తం: డీజీపీ

Final-Verdict---Everything-is-alert-says--DGP

అమరావతి: అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని.. ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు.

రైల్వేశాఖ అప్రమత్తం:

అయోధ్యపై తీర్పు నేపథ్యంలో రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు. అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వదంతులు సృష్టించేవారిపై నిఘాపెట్టారు. ప్రయాణికులు ఇటువంటి వదంతులు విన్నవెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

You might also like