Breaking News

ఆంధ్రప్రదేశ్

అమరావతి: ఈనెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 7 వరకు సమావేశాలు అమరావతి: శాసనసభా సమావేశాలు, ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలతో పర్యటనలు వాయిదా వేసుకున్న అధికార, ప్రతిపక్ష నేతలు విజయవాడ: పార్లమెంటరీ కమిటీల ఎంపిక కసరత్తు పూర్తి చేసిన జనసేన అధినేత, శుక్రవారం అధికారికంగా ప్రకటన అమరావతి: చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా విజయవాడ: కనకదుర్గ ఆలయంలో ప్రెస్ మీట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలపై నిషేధం, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు అమరావతి: కోడికత్తి కేసులో నిందితులకు బెయిల్ రాకుండా కేసులు నమోదు చేశాం -సీఎం చంద్రబాబు నెల్లూరు : మర్రిపాడు మండలం నందవరంలో రెండు కార్లు ఢీ, ముగ్గురు మృతి, మృతులు గాంధీనగర్ వాసులు అమరావతి: చిత్తూరు, కడపలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి అనంతపురం జిల్లాపై కసరత్తు ప్రారంభించిన సీఎం చంద్రబాబు తూ.గో జిల్లా: కోరుకొండ మండలం రాఘవాపురంలో కారు ఢీకొని వీరబాబు మృతి అమరావతి: వైఎస్.జగన్, వైఎస్.షర్మిలకు తెలంగాణ పోలీసులపై అంత నమ్మకం ఏమిటీ, ఏపీ పోలీసులపై వ్యతిరేకత ఎందుకు -మంత్రి సోమిరెడ్డి

తెలంగాణ

నాగర్ కర్నూలు: సోమశిల నల్లమల అడవిలో అడవి జంతువులను చంపుతున్న వేటగాడు శ్రీనివాసులు అరెస్టు, 100 ఉచ్చులు స్వాధీనం హైదరాబాద్: వైఎస్. షర్మిల కేసులో విచారణ వేగవంతం, 22 వెబ్ సైట్లు, యూ ట్యూబ్ నిర్వాహకులకు నోటీసులు హైదరాబాద్: రెండోసారి సీఎం గా ఎన్నికైన కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల అంతరాస్ట్ర బదిలీలకు గడువు జూన్ నెలాఖరు వరకు పొడిగింపు హైదరాబాద్: అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్, ఐదుగురు సభ్యులు గైర్హాజరు హైదరాబాద్: కార్ల అద్దాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్: సుల్తాన్ ఉలూమ్ కాలేజీ ఎదురు జిమ్ లో పిస్తోలు కలకలం, తనను తుపాకీతో బెదిరించారని ఆరోపించిన వ్యాపారి రాకేష్ హైదరాబాద్: మాదాపూర్ లో పలు హాస్టళ్లలో తనిఖీ చేసి అపరిశుభ్రతపై జరిమానా విధించిన జీహెచ్ఎంసీ అధికారులు మేడ్చల్: ఘట్ కేసర్ మండలం అంకుశాపుర్ గ్రామంలో ఒక వార్డులో డబ్బులు పంచుతుండగా పట్టుకున్న అధికారులు, రూ.61 వేలు స్వాధీనం హైదరాబాద్: చర్లపల్లిలో పెట్రోల్ మాఫియా అరెస్టు, నలుగురు అరెస్టు, మరో 8 మంది పరారీ

Photo GalleriesmoreSpecial Stories

karthika puranam

మరిన్ని వార్తలు

మెగా మనవరాలికి పేరు పెట్టేసారుగా..

            మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్న కుమార్తె, కల్యాణ్‌దేవ్ సతీమణి శ్రీజ కొన్ని రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ పాపకు పేరు పెట్టినట్టుగా శ్రీజ భర్త కళ్యాణ్ తాజాగా వెల్లడించాడు. తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "పాప పేరు #నవిష్క" అంటూ పేరు ను వెల్లడించాడు. నవిష్క అనే పదానికి అర్థం ఫరెవర్ న్యూ(ఎప్పుడూ కొత్తగా ఉండేది) అని తనే వెల్లడించాడు.